Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాశ్మీరీ పండిట్ కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ప్యాకేజ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీల్లో భాగంగా కాశ్మీరీ పండిట్ కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తొలి అడుగు వేసింది. ఈ క్రమంలో కాశ్మీర్ వ్యాలీలో వారు మళ్లీ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రతి ఫ్యామిలీకి రూ.20 లక్షల చొప్పున ప్యాకేజ్ ను సహాయంగా ఇచ్చేందుకు ఆమోదించనుంది. ఈ మేరకు నిన్న (గురువారం) నిర్వహించిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప్యాకేజ్ కు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. కాశ్మీరీ పండిట్ కుటుంబాలు తిరిగి అక్కడికి వచ్చి పునరావాసం ఏర్పరుచుకోవడానికి ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఈ విధంగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి అధికారికంగా ఆమోదం తెలపగా త్వరలో అమలు చేయనున్నారు.

More Telugu News